సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!

November 18, 2021 at 3:01 pm

ప్రీతి జింటా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దిల్ సే సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మొద‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకోవ‌డంతో పాటు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటిగా డెబ్యూ అవార్డ్‌ను అందుకుంది.

Mahesh Babu and Preity Zinta starrer Raja Kumarudu celebrates 20 years of completion; Read details | PINKVILLA

ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోని ఈ సొట్టబుగ్గల సుందరి.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన తొలి చిత్రం `రాజకుమారుడు`తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమై తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. బాలీవుడ్‌పైనే ఫోక‌స్ పెట్టిన ప్రీతి అక్క‌డ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

Preity Zinta feels proud she did 'Dil Chahta Hai'

ఇదిలా ఉంటే.. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ గుడ్‌ఎనఫ్ ను వివాహం చేసుకున్న ప్రీతి తాజాగా త‌ల్లైంది. 46 ఏళ్ల వ‌య‌సు ఉన్న ప్రీతి సరోగసి ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మినిచ్చింది. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేసింది.

Image

`అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్‌, నేను సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చాం. ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. మా కుటుంబంలోకి జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్ లకు స్వాగతం` అంటూ భ‌ర్త‌తో దిగిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ తెలిపింది ప్రీతి. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts