టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు.
ఉదాహరణకు ఎన్టీఆర్ సరసన నటించిన జయసుధ, రతి అగ్నిహోత్రి,రాధలు కొడుకు బాలకృష్ణ సరసన నటించారు. అయితే నాగార్జున విషయానికి వస్తే..తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన శ్రీ దేవి, రాధలతోనే కాకుండా కొడుకు నాగ చైతన్యకు జోడిగా నటించిన కాజల్, లావణ్య త్రిపాఠి, రకుల్ వంటి హీరోయిన్లతో జతకట్టాడు. దీంతో అటు తండ్రి, ఇటు తనయుడు భామలతో జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు.