ఆ యంగ్ హీరోయిన్‌తో చైతు ప్రేమాయ‌ణం..ఎవ‌రామె..?

భార్య‌, టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ స‌మంతతో ఇటీవ‌లె అక్కినేని హీరో నాగ‌చైత‌న్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రామంటే కృతి శెట్టి. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే.

Bebamma Krithi Shetty Highlight In Bangarraju Movie Tollywood Nagarjuna  Nagachaitanya - Telugu Bagarraju Kalyan Krishna King Sh-TeluguStop

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` సినిమాలో నాగ‌చైత‌న్య‌, కృతి శెట్టి జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. `సోగ్గాడే చిన్నినాయనా` పీక్రెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మైసూర్‌లో జ‌రుగుతోంది.

Akkineni Nagarjuna and Naga Chaitanya's 'Bangarraju' is officially launched | Telugu Movie News - Times of India

ప్ర‌స్తుతం అక్క‌డ నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్‌లో వచ్చే లవ్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారట‌. ఇక మైసూర్‌ షెడ్యూల్‌ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేస్తార‌ని స‌మాచారం. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

 

Share post:

Latest