తళుక్కుమని పార్టీలో మెరిసిన టాలీవుడ్ కమెడియన్స్..!

November 15, 2021 at 11:27 am

టాలీవుడ్ లో కమెడియన్స్ అందరూ ఓకే గ్రూపుగా ఉండి ప్రతి నెల ఏదో ఒక పార్టీని చేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు. ఈ గ్రూపులో వెన్నెల కిషోర్, నందు, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, చిత్రం శీను, సత్యం రాజేష్, వేణు, ధన్ రాజ్ ఇంకా మరి కొందరు సభ్యులు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కోసారి పార్టీలు ఇచ్చుకుంటూ ఐక్యమత్యంగా ఉంటున్నారు.

తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్లీ కలుసుకొని ఒక పార్టీ చేసుకుంటున్నారు. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. స్వీట్ అండ్ క్యూట్ పార్టీ అంటూ పోస్టింగ్ చేశారు వెన్నెల కిషోర్. కమెడియన్ సత్య, లవ్ యు టూ అంటూ యాక్టర్ ధనరాజ్ ఫోటోతో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది. కమెడియన్స్ అందరూ కలిసి సీరియస్ గానే ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక వీరందరు ఇలాగే ఎల్లకాలం కలిసి ఉండాలని మనం కోరుకుందాం.

తళుక్కుమని పార్టీలో మెరిసిన టాలీవుడ్ కమెడియన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts