మరొకసారి రెండు భాషల్లో విడుదల కానున్న మహాసముద్రం సినిమా..!

November 13, 2021 at 10:17 am

ఈ ఏడాది దసరా కానుకగా పలు సినిమాలు విడుదలయ్యాయి. అలా విడుదలైన సినిమాలలో మహా సముద్రం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాగా, కానీ అటు హీరోలను, అభిమానులను నిరాశ పరిచింది. RX -100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా హీరో సిద్ధార్థ్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సిద్ధార్థ్. కానీ ఫైనల్ గా ఈ సినిమా ఆయనకు కలిసి రాలేదు. అయితే ఈ సినిమా ఎట్టకేలకు NETFLIX లో విడుదల కానుంది. అది కూడా తెలుగు , తమిళంలో కూడా ఈ సినిమాని ఒకేసారి విడుదల చేయనున్నారు. కాని ఏ రోజున విడుదల చేస్తారో అన్న విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మరొకసారి రెండు భాషల్లో విడుదల కానున్న మహాసముద్రం సినిమా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts