ఇంట్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది:సైఫ్ అలీ ఖాన్?

November 13, 2021 at 10:52 am

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బంటీ ఔర్‌ బబ్లీ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్‌ అలీ ఖాన్. ఈ షోకు అతనితో పాటుగా ఆ చిత్రయూనిట్‌ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ,సైఫ్‌ తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం చేశాడు.

ఆ తరువాత మీకు పని అంటే ప్రేమా? లేక రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా? అని కపిల్ శర్మ ప్రశ్నించగా దీనికి సైఫ్‌ ఫన్నీ గా స్పందిస్తు ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువమమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ కాస్త ఫన్నీ గా సమాధానం ఇచ్చారు అలీ.

ఆయన సమాధానం విని కపిల్ తో సహా అక్కడున్న వారందరు పక పక నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్‌గా మారింది.ఇంట్లో ఉండటం కన్నా పనులతో బిజీగా ఉండటమే మేలు అన్న డైలాగ్ బాగా వైరల్ అవుతోంది.

ఇంట్లో ఉంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది:సైఫ్ అలీ ఖాన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts