ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి.. చిరంజీవి కామెంట్స్ వైరల్?

కిట్టు నల్లూరి దర్శకత్వంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్‌ కుమార్తె వర్షా విశ్వనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 11:11. ఇందులో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు.టైగర్‌ హిల్స్‌ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్‌ పతాకాలపై గాజుల వీరేష్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ 80, 90 దశకంలో దర్శకుడు కోటి హిట్లర్, రిక్షావోడు ఇలా నాకు 12 సినిమాల వరకు చేశారు.సుమారు 60 పాటలంటే నాకు 90 శాతం సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చారు.

ఇంత మంచి హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన కోటిగారి ఋణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు చిరంజీవి.అలాగే కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్తాను. ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్‌గా పని చేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది అని తెలిపారు చిరంజీవి.