షాకింగ్ లుక్‌లో బెద‌ర‌గొట్టేసిన‌ చిరు..వీడియో వైర‌ల్‌!

హాలోవీన్.. ఏటా అక్టోబరు 31న జ‌రుపుకుంటారు. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ దెయ్యాల పండగ.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొంద‌రు హాలోవీన్ ను ఎంతో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంది. ఇక హాలోవీన్ నాడు దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చీరంజీవి కూడా షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ బెద‌ర‌గొట్టేశారు. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్న చిరంజీవి.. హాలోవీన్ సంద‌ర్భంగా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేశారు.

అలాగే ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ తెలిపిన చిరు.. త‌న ఫ‌న్నీ వీడియోకు `థ్రిల్లింగ్ డే` అని కామెంట్ చేశారు. దాంతో చిరు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఆచార్య పూర్తి చేసిన చిరు ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఆ త‌ర్వాత‌ మెహర్ రమేశ్ దర్శకత్వంలో `భోళా శంకర్`, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.