ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేస్తారు అంటున్న డైరెక్టర్ మారుతి..!!

November 1, 2021 at 12:34 pm

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ తరహాలో చిన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో, ప్రేమ కథ చిత్రం వంటి సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారిపై కొన్ని కామెంట్లు చేశాడు మారుతి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

కరోనా సమయంలో కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. కేవలం 20 రోజుల్లో తను కథ రాసి, 30 రోజుల్లో ఒక సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఇక అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించాలని అజయ్ గోష్ తీసుకున్నాడట.అయితే ఈ సినిమాని కేవలం టైం పాస్ కోసమే తీశానని తెలియజేశాడు. కానీ ఈ సినిమా చాలా సీరియస్ గా వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇక హీరో సంతోష్ గురించి మాట్లాడుతూ.. యు.వి.క్రియేషన్స్ ప్రస్తుతం సంతోష్ సినిమాలు తీస్తున్నారని తెలిపారు. యు.వి.క్రియేషన్స్ వారు ఎవరైనా ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు వారికి వంద రూపాయలు తిరిగి చెల్లిస్తారని, వారు ఎవరి రుణం ఉంచుకోరని మారుతి చెప్పుకొచ్చాడు. కానీ ఇండస్ట్రీలో చాలామంది వాడుకొని వదిలేసే వారు ఉంటారు. ఇలాంటివారు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు అంటూ మారుతి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియ జేశాడు.

ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేస్తారు అంటున్న డైరెక్టర్ మారుతి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts