నోటి దూలతో కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్?

సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలన్న,నిల దొక్కుకోవాలన్నా అనిగిమనిగి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఇండస్ట్రీలలో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా పైకి ఎదగాలి అన్నా కూడా ఓర్పు, సహనం లాంటివి ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ల కెరీర్ ను వాళ్లే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కొందరు వారికున్న నోటిదురుసు వల్లే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.

ఇలా ఇండస్ట్రీకి సినీ నేపథ్యం లేకుండా ఉన్న కుటుంబాల నుంచి వచ్చి ఆ తర్వాత చిన్న చిన్న హీరోలతో నటించి ప్రస్తుతం ప్రతి ఒక స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు కొన్ని సందర్భాలలో సినిమా యూనిట్ పై నోరు పారేసుకున్నారు.ఈ క్రమంలోని వారందరికీ నోటిదూల అని గ్రహించిన దర్శకనిర్మాతలు మెల్లిమెల్లిగా వారిని పక్కన పెట్టడం చేశారు.ఇలా కేవలం నోటి దూల కారణంగానే ఇండస్ట్రీలో ఎంతో మంచి కెరీర్ లో ఉన్న కొందరు సెలబ్రెటీలు ఇండస్ట్రీకి దూరమయ్యారు.