గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

November 1, 2021 at 12:53 pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Allu Arjun's 'Pushpa' release date; Simbu's 'Maanaadu' trailer: South Films Updates

అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రో మూడు రోజుల్లో దీపావ‌ళి(న‌వంబ‌ర్ 4) పండ‌గ రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

Pushpa: Listen to 'Srivalli' song by Rashmika Mandanna Fans Fida; Siddha Shreeram's Multiplayer - allu arjun rashmika mandannas pushpa movie second song srivalli released » Jsnewstimes

అయితే ఈ దీపావ‌ళికి బ‌న్నీ ఫ్యాన్స్ కోసం పుష్ప టీమ్ సూప‌ర్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నారట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. దీపావ‌ళి పండ‌గ నాడు ఓ ప్రత్యేక టీజర్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ ఫోషించిన పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేయగా.. ఇప్పుడు ఈ సినిమాలోని అన్ని పాత్రలతోనూ ఓ టీజర్ ను కట్ చేస్తున్నారని తెలుస్తోంది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Allu Arjun as Pushpa Raj tries to woo Rashmika Mandanna's Srivalli in Pushpa: The Rise's second single | Telugu Movie News - Times of India

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts