`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

November 1, 2021 at 11:35 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

RRR first glimpse out. Jr NTR and Ram Charan are here to blow your mind  away - Movies News

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. తాజాగా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను వ‌దిలారు. ఇది కేవలం 45 సెకండ్ల వీడియోనే.. కానీ చూసినకొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది. డైలాగ్స్ అనేవి ఏమీ లేక‌పోయినా.. అద్బుతమైన సీక్వెన్స్, మూమెంట్స్ తో ఈ గ్లింప్స్‌ను నింపేసారు.

RRR Glimpse: Ram Charan, Jr NTR 'Rise, Roar And Revolt' In This Magnum  Opus; Alia Bhatt, Ajay Devgn, Olivia Morris' Debut In Tollywood Look  Promising (Watch Video) | 🎥 LatestLY

అలాగే ఈ గ్లింప్స్‌కు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవ‌ల్ అన‌డంలో సందేహ‌మే లేదు. మొత్తానికి అదిరిపోయిన ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్‌ను తెప్పించ‌డ‌మే కాదు.. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఆకాశానికి ఎత్తేసింది. కాగా, డివివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు.

`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts