చెల్లెలి పాత్ర కోసం కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి సురేష్..!!

ఈమధ్య కీర్తిసురేష్ క్రేజ్ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి.. ఎందుకంటే ఈమె మహానటి సినిమా తర్వాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ, ప్రస్తుతం చెల్లెలి పాత్రకు కూడా కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగింది అంటే ఈమె క్రేజ్ ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్న ఈ భామ, మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఒకపక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క చెల్లెలి పాత్రలు కూడా ఒప్పుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

టాప్ ప్లేస్ లో ఉన్న కీర్తి .. చెల్లెలి పాత్రలో నటిస్తుండటం పై విమర్శలు వినిపించాయి..అయినా కమర్షియల్ గా కూడా ఈమెకు బాగానే వర్కవుట్ అవుతోంది. రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా లో రజనీకాంత్ కి చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి సురేష్. ఇప్పుడు తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి కూడా చెల్లెలి పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. అయితే పెద్దన్న సినిమాలో చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈమె చెల్లెలు పాత్ర కోసమే రెండు కోట్లు తీసుకుంటే , హీరోయిన్ పాత్ర కోసం ఎన్ని కోట్లు తీసుకుంటుందో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.