`ఆదిపురుష్‌`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్‌!

November 11, 2021 at 2:00 pm

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీత‌గా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు.

Image

రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్ట‌ర్ ఓం రౌత్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. క‌రోనా సెకెండ్ వేవ్ ఊపందుకుంటున్న స‌మయ‌లో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా ఓం రౌత్ తెలియ‌జేశారు.

Image

ఈ మేర‌కు కొన్ని ఫొటోల‌ను షేర్ చేస్తూ.. 103 రోజులు షూటింగ్ ని తాము కంప్లీట్ చేసుకున్నాం అని మేము క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ ని చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ఇక షూటింగ్ పూర్తి అవ్వ‌డంతో.. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఇక‌పై వ‌రుస అప్డేట్లు రావ‌డం ఖాయ‌మ‌ని ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

`ఆదిపురుష్‌`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts