స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో ఈమెను జూనియర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ భామ మొట్ట మొదట 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` అనే హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించి ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్.. `ఉల్లాసంగా ఉత్సహంగా` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. స్నేహా సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే స్నేహా ఉల్లాల్ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.
కానీ, అందరి ఊహలకు భిన్నంగా స్నేహా ఉల్లాల్ ఫేడౌట్ హీరోయిన్గా ముద్రను వేయించుకుంది. అయితే చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకున్న సినీ తారల్లో స్నేహా ఉల్లాల్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి కారణం ఆమె చేసిన డిమాండ్లే అని తెలుస్తోంది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో స్నేహా ఉల్లాల్ నిర్మాతలతో చాలా కఠినంగా ప్రవర్తించిందని అప్పట్లో టాక్ నడిచింది.
ఏదైనా అవకాశం వస్తే వారు చెప్పిన దాని కంటే రెండింతలు పారితోషికం డిమాండ్ చేసేదట. అందు వల్లనే స్నేహా ఉల్లాల్‌కి అవకాశాలు తగ్గిపోయాయని అప్పట్లో జోరుగా ప్రచారాలు జరిగాయి. కాగా, స్నేహాఉల్లాల్ లాంగ్ గ్యాప్ తర్వాత `ఎయిట్` అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. సప్తగిరి హీరోగా చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.