అక్కినేని-మంచు ఫ్యామిలీల‌కు అది అస్స‌లు అచ్చిరాలేదుగా..!!

November 26, 2021 at 8:05 am

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అక్కినేని, మంచు ఫ్యామిలీల‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండు ఫ్యామిలీల‌కు ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా..? మొద‌టి పెళ్లి అచ్చి రాక‌పోవ‌డం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. అక్కినేని నాగేశ్వరరావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున మొద‌ట విక్ట‌రీ వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు.

కానీ, కొన్నేళ్ల‌కే వీరి బంధానికి బీట‌లు వార‌డంతో.. ల‌క్ష్మికి విడాకులు ఇచ్చేసిన నాగ్ న‌టి అమ‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాగే నాగ్ పెద్ద త‌న‌యుడు నాగ‌చైత‌న్య స‌మంత‌ను ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఇటీవ‌లె వీరిద్ద‌రూ విడిపోయారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌.. శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు. కానీ, వీరి బంధం పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్ల‌కుండానే తెగిపోయింది. ఇక నాగేశ్వరరావు పెద్ద కూతురు కొడుకైనా సుమంత్.. కీర్తి రెడ్డి ని వివాహం చేసుకోగా పెళ్లై రెండేళ్ల‌కే వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

మంచు ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే.. మంచు మోహన్ బాబు మొదలుకొని మంచు విష్ణు వరకు ప్రతి ఒక్కరికి మొదటి పెళ్లి కలిసి రాలేదు. మొహ‌న్ బాబు మొద‌ట విద్యావతిని పెళ్లి చేసుకోగా.. ఆమె ప‌లు కార‌ణాల వ‌ల్ల మ‌ర‌ణించింది. దాంతో మోహ‌న్ బాబు విద్యావ‌తి చెల్లెలు నిర్మలాదేవిని రెండో వివాహ చేసుకున్నాడు.

అలాగే మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మీ మొదటి భర్తతో విభేధాలు రావడంతో అత‌డికి విడాకులు ఇచ్చేసింది. ఆ త‌ర్వాత 2006లో ఆండీ శ్రీనివాస్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఇక మంచు మ‌నోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల ప‌లు కార‌ణాల వ‌ల్ల వీరు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తానికి అటు అక్కినేని, ఇటు మంచు ఫ్యామిలీ న‌టుల‌కు మొద‌టి పెళ్లి ఏ మాత్రం క‌లిసి రాలేదు.

అక్కినేని-మంచు ఫ్యామిలీల‌కు అది అస్స‌లు అచ్చిరాలేదుగా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts