ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!

November 11, 2021 at 7:25 pm

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాను రీమేక్ గా బోలా శంకర్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి లాంఛ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది.

Chiranjeevi Praises Anchor Rashmi Corona Virus Dog Rescue Covid-19 - Telugu Praises-Telugu Tren-TeluguStop

రష్మీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. చిరంజీవి సినిమాతో నైనా యాంకర్ రష్మి జాతకం మారుతుందేమో చూడాలి. ఇక ఈమెతో పాటు మరొక యాంకర్ శ్రీముఖి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక బిత్తిరి సత్తి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇక వీరితో పాటు ప్రభాస్ శీను, ఉత్తేజ్, గెటప్ శీను ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంక వీరితో పాటు మరికొంత మంది నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే రష్మి కి వరుస అవకాశాలు వెళ్ళు పడతాయనే ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts