అదృష్టం అంటే వీరిదే.. వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధ దంపతులకు అనుకోని షాక్ …!

ముందుగా మీకు ఒక సామెత గురించి చెప్పాలి. అదేంటంటే అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్నట్టే… ఎదో పార్క్ లో సరదాగా వాకింగ్ చేద్దామని వెళ్లిన ఒక వృద్ధ దంపతులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనుకోండి. అదృష్టం స్వయంగా వారి ఇంటి తలుపు తట్టి మరి వరాల జల్లును కురిపించిందంటే నమ్మండి. పార్క్ లో వాకింగ్ చేసే వారికి మిళుక్ మిళుక్ మంటూ ఒక రాయి తారస పడింది. మొదట్లో అదేదో అనుకుని పట్టించుకోలేదు కానీ దగ్గరకు వెళ్ళాక గాని తెలియలేదు అది ఒక విలువైన వజ్రం అని.. ఇంకేముంది ఆ వృద్ధ జంట జీవితాలే మారిపోయాయి. ఇంతకీ ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఉంటున్న వృద్ధ దంపతులు అయిన నొరీన్ రెడ్‌బర్గ్, ఆమె భర్త మైకేల్ కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. కాగా ఆ జంటకు ప్రతి రోజు ఉదయం పూట వాకింగ్ చేయటం అలవాటు. ఈ క్రమంలోనే సరదాగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వజ్రాలకు ప్రసిద్ది గాంచిన అర్కాన్సాస్‌ లోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కుకి వెళ్లారు. ఆ పార్క్ వజ్రాలకు ప్రసిద్ధిగా పేరుగాంచింది. అలా ఇద్దరు ఆ పార్క్ లో వాకింగ్ చేసే క్రమంలో నోరిస్ కు ఒక ప్రదేశంలో ఏదో మెరుస్తున్న వస్తువు లాంటిది ఒకటి కనిపించింది. మొదట్లో నోరిస్ దానిని రాయో లేక ఏ గాజు ముక్కో అనుకున్నది. తీరా ఆ వస్తువు దగ్గరకు వెళ్లేకొద్దీ దాని మెరుపు బాగా కాంతివంతంగా ప్రకాసించడంతో అది ఏంటో చూద్దామని వెళ్లి దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది.

అది పసుపు పచ్చని రంగులో మిరుమిట్లు కొలుపుతూ మెరుస్తున్న రాయిలా కనిపించి దానిని చూసే మురిసిపోయింది. దానిని నోరీన్ పార్కులోని డైమండ్ డిస్కవరీ సెంటర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడి సిబ్బంది దానిని అరుదైన పసుపు రంగు వజ్రంగా గుర్తించారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉన్న పార్క్ ప్రాంతంలో దొరికిన వజ్రాలు వారికే చెందుతాయని పార్క్ నియమ నిబంధలలో ఉండడంతో ఆ వజ్రం నోరిస్ సొంతం అయ్యింది. ఆ వజ్రం 4.38 క్యారెట్ల బరువు ఉంది. సుమారు ఆ వజ్రం విలువ 15 వేల డాలర్ల అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షలు నుంచి 65 లక్షల రూపాయల వరకూ ఉండవచ్చని డైమండ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.