త‌గ్గేదే లే అంటున్న `ఆహా`..వ‌చ్చే 3 నెల‌ల్లో సినిమాల జాత‌రే జాత‌ర‌!?

October 11, 2021 at 8:41 am

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో.. కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్ర‌స్తుతం టాప్ ఓటీటీల్లో `ఆహా` ఒక‌టి. తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహా..ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ త‌గ్గేదే లే అన్న రీతితో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆహా మ‌రో రేంజ్‌కి వెళ్ల‌బోతోంది.

Aha OTT Movies Review | AHA new releases | Aha App Telugu Movies & Originals | Aha APP Movies Review - YouTube

ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన `ల‌వ్ స్టోరి` చిత్రం ఆహాలో అక్టోబ‌ర్ 22న స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. ఇదొక్క‌టే కాదు.. వ‌రుణ్ తేజ్ సినిమా గ‌ని, అఖిల్ న‌టిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, నాగ‌శౌర్య మూవీ ల‌క్ష్య‌, ఆనంద్ దేవ‌ర‌కొండ మూవీ పుష్ప‌క విమానం, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మంచి రోజులు వ‌చ్చాయి కూడా ఆహాలో స్ట్రీమ్ కాబోతున్నాయి.

Unstoppable with NBK is Baap of all Talk Shows - English

అంతేనా.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన డీజే టిల్లు, పూరి ఆకాశ్ న‌టించిన రొమాంటిక్, రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం అనుభ‌వించు రాజా చిత్రాలూ ఆహాలో రాబోతున్నాయి. మొత్తానికి వ‌చ్చే మూడు నెల‌ల్లో ఆహా ల‌వ‌ర్స్‌కు సినిమాల జాత‌రే అని చెప్పాలి. మ‌రోవైపు ఆహా వారు నంద‌మూరి బాల‌కృష్ణ చేత ఓ టాక్ షో నిర్వ‌హించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ షో ఆహా ఫ్లాట్ ఫామ్‌కే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతోంది.

 

త‌గ్గేదే లే అంటున్న `ఆహా`..వ‌చ్చే 3 నెల‌ల్లో సినిమాల జాత‌రే జాత‌ర‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts