ట్రూత్ సోషల్ మీడియాను తానే సొంతంగా స్టార్ట్ చేసిన ట్రంప్..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగానే ఒక సోషల్ మీడియాను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించారు. అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ఆయన బహిష్కరించాయి. తొమ్మిది మాసాల పాటు ఇంటర్నెట్ సరిగ్గా చూడలేదట. అందుకోసమే ప్రముఖ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఏర్పాటు చేశారు.

TMTG సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రూత్ సోషల్ పేరుతో TMTG సామాజిక మాధ్యమాలు ఏర్పాటు చేయనుందని అందులో తెలియజేశారు. కొంతమంది అతిథుల కోసం వచ్చే నెల బీటా వెర్షన్ ను ప్రారంభిస్తున్నట్లు గా తెలియజేసింది. ఫ్రీ ఆర్డర్ ల కోసం, ఇప్పటికే యాపిల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉందని తెలియజేస్తోంది.

భవిష్యత్తులో మరింతగా ఈ సేవలను పెంచుతామని తెలియజేస్తున్నారు. క్రూరమైన భారీ టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా..”ట్రూత్ సోషల్”ను ఏర్పాటు చేశానని అని ట్రాంప్ తెలియజేశాడు. తాలిబన్లు ట్విట్టర్ ను విపరీతంగా వాడుతున్న ప్రపంచంలో ఉన్న మనం ఇప్పుడు. అదే ట్విట్టర్లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడు నోరు నొక్కేశారు. అని తెలియజేశాడు