జస్టిస్ లీగ్ డైరెక్టర్ బెదిరించాడు అంటున్న వండర్ ఉమెన్.. ఎందుకంటే?

ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొన్న ఈ సంఘటన గురించి మీడియా ముందు బయట పెట్టారు. ఈ క్రమంలోనే వండర్ ఉమెన్ ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాల్ గాడెట్ కూడా ఒక దర్శకుడు నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.డీసీ సూపర్‌ హీరో మూవీ జస్టిస్‌ లీగ్‌ కి మొదట హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించాడు.

అనంతరం కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి అతను తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్‌లో ఉండగా తన కెరీర్‌ గురించి బెదిరించాడని నటి గాల్‌ గాడెట్‌ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్‌ అయితే వార్నర్‌ బ్రదర్స్‌ నాకు అభయం ఇచ్చారని చెప్పింది.గాల్‌ గాడెట్‌ డైరెక్టర్‌ వెడాన్‌పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఎంతో మందితో డిఫరెంట్‌గా బిహేవ్‌ చేసేవాడని ఆమె ఇంతక ముందే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ లు పెట్టింది.