జైల్లో ఆర్యన్ నువ్వు కలుసుకున్న షారుక్ ఖాన్.. ఆ తరువాత?

బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా అతన్ని చూసేందుకు షారుఖాన్ జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో బుధవారం ఆయన తన తనయుడిని కలిసి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబై కోర్టు ఇటీవలే మరొకసారి ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ కి మరొకసారి బెయిల్ రద్దవడంతో తనయుడిని చూసేందుకు షారుక్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే షారుక్ ఖాన్ అలాగే అతడి భార్య గౌరీఖాన్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ తో వీడియో కాల్ మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించి కుటుంబ సభ్యులను కలుసుకునే వెసులుబాటు కల్పించడంతో షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ ని కలుసుకునేందుకు వచ్చారు.