శృంగారం గురించి మాట్లాడాలంటే వారికి భయం.. దంగల్ నటి?

బాలీవుడ్ బ్యూటీ సాన్య మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ దంగల్ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా ఇది కూడా ఒకటి అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇది సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత పలు రకాల షోలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సాన్యా ససురల్ వండర్ పూల్ అనే రొమాంటిక్ కామెడీ షో చేస్తోంది . ఈ కామెడీ షో ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మనదేశంలో జనాలు శృంగారం గురించి మాట్లాడాలి అంటే భయపడతారు అంటూ ఈమె తెలిపింది. అలాగే ఈ కామెడీ షో గురించి ఈమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు శృంగారం అనే పదం భారత్లోని నిషిద్ధం. కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి. అందుకే ససురల్ వండర్ ఫుల్ స్టోరీస్ ని రూపొందించేందుకు క్రియేటర్స్ ముందుకు వస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అనంతరం సామాన్య తన షో గురించి మాట్లాడుతూ.. ఇందులో తాను అషిమా అనే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. ఇందులో నేను చేసే ఈ అషిమా పాత్రకి శృంగారం అనే పదం వాడాలి అంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది తన భర్త అలాగే ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లినిక్ నడుపుతూ ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీ అని ఆమె తెలిపింది. మేము ఈ షోతో కొంతమంది నైనా మార్చగలమని ఆశిస్తున్నాము అంటూ ఆమె తెలిపింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కొందరు అయినా ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడతారని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.