చెన్నై నుంచి హైదరాబాద్ కు బైక్ పై వచ్చేవాణ్ణి.. శ్రీకాంత్?

గురు పవన్ దర్శకత్వంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్,భూమిక,తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. జీవితం అంటే ఏమిటి? లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు శ్రీకాంత్. జీ మహేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అనుకోకుండా కలిసి నలుగురు బైక్ రైడర్ వారి కష్టాలను ఎలా పంచుకుంటారు? వాటిని ఏ విధంగా పరిష్కరించుకుంటారు? అనేది ఇదే మా కథ లో ఆసక్తిగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మహేంద్ర పాత్రలో నేను చేశాను అని తెలిపారు శ్రీకాంత్.

ఇందులో 24 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి ని కలుసుకునేందుకు లడక్ కి బైక్ లో వెళ్లే పాత్ర నాది. బైక్ లోనే ఎందుకు వెళ్తాడు అన్న దానికి కూడా ఒక కథ ఉంటుంది, కులుమనాలి నుంచి లడక్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీద తిరిగే వాణ్ణి.హైదరాబాద్ కు కూడా బైక్ మీద వచ్చే వాణ్ణి. మామూలుగా బైక్ రేస్ అంత ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపు లో కలిసిన వారు జీవితాంతం సంతోషంగా ఉంటారు. వారి జీవిత కష్టాలు కూడా ఈ సినిమాలో చూపించాం అని తెలిపారు శ్రీకాంత్. సాయి ధరంతేజ్ గురించి మాట్లాడుతూ అయితే సాయి తేజ్ క్షేమంగా ఉన్నారు. నేను అతనితో మాట్లాడాను. అలాగే సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు శ్రీకాంత్.