శ్రీ రెడ్డి చీర విప్పడం వల్లే ఆ విషయం తెలుసుకున్నా అంటున్న ఆర్జీవీ..!!

October 25, 2021 at 6:53 pm

రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే.. అలాంటిది ఈయన శ్రీరెడ్డి గురించి మాట్లాడడం తో ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా జరిగిన మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ.. అక్టోబర్ 10వ తేదీన జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పదవిని కైవసం చేసుకోగా, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని ఆయన పరాజయం పొందారు.. అంతే కాదు ప్రకాష్ రాజు తరఫున నిలబడ్డ సభ్యులు కూడా గెలిచినప్పటికీ రాజీనామా చేయడం గమనార్హం.

ఇకపోతే మా ఎలక్షన్లలో జరిగిన వివాదాలు ,గొడవలు, ఒకరినొకరు తిట్టుకోవడం ఇవన్నీ చూసిన రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ చూస్తుంటే అసహ్యం గానూ కామెడీగానూ ఉందంటూ తెలిపాడు.. నిజంగా సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందని నాకు తెలియదు.. మొదటిసారి శ్రీ రెడ్డి చీర విప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ధర్నా చేసిన అప్పుడే నాకు అర్థం అయింది.. సినీ ఇండస్ట్రీలో మా అనే ఒక అసోసియేషన్ కూడా ఉంది అని.. నిజానికి సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు.. మా బిల్డింగ్ ఎందుకు.. ఈ మా ఎన్నికల గోల ఎందుకు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు..

శ్రీ రెడ్డి చీర విప్పడం వల్లే ఆ విషయం తెలుసుకున్నా అంటున్న ఆర్జీవీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts