రారా నీ అబ్బా..మోహన్ బాబు పై విరుచుకుపడ్డ మహిళ.. వీడియో వైరల్..!

October 17, 2021 at 6:50 pm

మంచు విష్ణు అధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజున ప్రముఖ నటి శ్రీనిజ మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు మంచు విష్ణుకు అధ్యక్ష పదవి చేపట్టే అర్హత లేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది..ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.. మోహన్ బాబును ఒరేయ్ నీయబ్బ నన్ను ముండమోపి అంటావా.. రా రా చూసుకుందాం.. నికార్సైన ఆంధ్ర ఆడదాన్ని అంటూ తనదైన శైలిలో మోహన్ బాబు పై విరుచుకుపడింది.

మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత మహిళా నటీనటులకు ఏం భరోసా ఇచ్చారు. గతంలో మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉండి ఏం చేశారు. ఇప్పుడు విష్ణు మంచు వచ్చి ఏం చేస్తారు? అని నటి శ్రీనిజ ప్రశ్నించారు. మా ఎన్నికలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళ్లు, వేళ్లు పట్టుకొన్నారు. పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకొంటామని చెప్పిన తిమింగళం. పవన్ కల్యాణ్‌ను అడ్డుకొంటామని చెప్పి.. మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించమని కోరారు అని నటి శ్రీనిజ ఆరోపించారు.

రారా నీ అబ్బా..మోహన్ బాబు పై విరుచుకుపడ్డ మహిళ.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts