శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి హీరో హీరోయిన్?

October 14, 2021 at 4:24 pm

పెళ్లి సందడి హీరో హీరోయిన్ రోషన్,శ్రీలీల తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటుగా ఈ మూవీ టీమ్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నేడు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రబృందం స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.ఈ ఫోటోలలో హీరోయిన్ శ్రీలీల, హీరో రోషన్ తోపాటు దర్శకురాలు గౌరీ రోనంకి కూడా ఉంది.

ఈ నేపథ్యంలో హీరో రోషన్ మాట్లాడుతూ.. రేపు మా సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చామని తెలిపారు. అంతే కాకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. హీరోయిన్ స్త్రీల మాట్లాడుతూ.. సినిమా బృందం మొత్తం శ్రీవారి దర్శించుకోవడానికి వచ్చాము. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని కుటుంబంతో కలిసి అందరూ చూడవచ్చు అని దర్శకురాలు గౌరీ రోణంకి తెలిపారు.

శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి హీరో హీరోయిన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts