చిరుని ఫాలో అవుతున్న నాగార్జున‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ఇటీవ‌ల కాలంలో రీమేక్ చిత్రాల‌కు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే స‌క్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

Chiranjeevi birthday: 12 of his best songs that made him 'King of Dance' | Entertainment News,The Indian Express

ఈ లిస్ట్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ ముందుండ‌గా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మ‌ధ్య కాలంలో రీమేక్ చిత్రాల‌పై ఎక్కువ మ‌క్కువ చూపుతున్నారు. అయితే ఇప్పుడు కింగ్ నాగార్జున సైతం చిరంజీవినే ఫాలో అవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. కేవలం ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలే కాకుండా.. రీమేక్ చిత్రాల‌ను కూడా చేయాల‌ని నాగ్ భావిస్తున్నార‌ట‌.

Nagarjuna looking to work with web series

ఇందులో భాగంగానే నాగ్ రీమేక్ చేసేందుకు ఓ మ‌ల‌యాళ చిత్రాన్ని ఎంచుకున్నార‌ట‌. ది గ్రేట్ ఇండియన్ కిచన్ సినిమా.. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు జియో బేబీ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు నాగార్జున ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.