ముంబై రేవ్ పార్టీ లో దొరికిన షారుక్ ఖాన్ కొడుకు..!

ముంబైలో మరోసారి ఎన్సీబీ అధికారులు రేవు పార్టీని నాశనం చేశారు అంటూ కొంతమంది ఏం చేస్తున్నారు. కానీ ఎన్సీపీ అధికారులు డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడం కోసమే వీరు పార్టీకి రావడం గమనార్హం. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉండడంతో డ్రగ్స్ వ్యవహారంలో అతడిని కూడా ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ యొక్క పూర్తి సమాచారం కూడా మనం ఒక సారి తెలుసుకుందాం..

ముంబై శివారులో జరిగిన రేవ్ పార్టీపై నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు జరపడం కలకల రేపింది. తీరంలోని క్రూజ్ షిప్ లో ఈ పార్టీ జరగడం విశేషం. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ…సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. 2021, అక్టోబర్ 02వ తేదీన శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. అధిక మొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ కు చెందిన పలువురు కొడుకులు కూడా అధికారుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం..వీరిని ముంబైకి తీసుకురానున్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడారన్న విషయంతో…డ్రగ్స్ వాడడం చర్చనీయాంశమైంది. ఇక వీరిపై కేసు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.