మెగాఫ్యామిలీ పై సెటైర్స్ వేసిన మోహన్ బాబు?

మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా మోహన్ బాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ పై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సినిమాలు ఒకlసారి హిట్, ఒకసారి ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినప్పటికీ బయపడకుండా ఓటు వేసి విష్ణు ను గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు.

నేను ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం నాకు చెడు చేసింది.విష్ణు మా కి భారతదేశం గర్వించదగ్గ స్థాయికి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలి. అలాగే అన్నిటికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని కలవాలి. అందుకు నేను కూడా అభ్యర్థిస్తాను. మా సభ్యులకు సహాయం చేయమని అడుగుతాను. మా సభ్యులందరూ ఒక్కటే.

విష్ణు ప్రామిస్ చేసినవన్నీ నెరవేరుస్తాడని భావిస్తున్నాను. కలసి మెలసి ఉందాం. కలసి కట్టుగా సాధిద్దాం. సమస్యలు ఉంటే అధ్యక్షుడి దృష్టికి తీసుకురండి. ఎన్నికలను ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించారు. దయచేసి నన్ను రెచ్చకొట్టవద్దు,మనందరం కూడా ఒక్కటే అని మోహన్ బాబు తెలిపారు.