మావోయిస్టులలో ఒక శకం ముగిసింది.. మరి నెక్స్ట్ ఎవరు..?

మావోయిస్టులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే కాదు అని చెప్పాలి.. ఈ మావోయిస్టులు ప్రజలకు, అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తూ ఒకవేళ వీరిపై ప్రభుత్వం తన పంజా విసిరితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.. అయితే వీళ్ళు చేసే పనులు ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి మంచి చేకూర్చినా.. ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా ఉండడంతో ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వీరిపై తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రముఖ మావోయిస్టుల లో అగ్ర నేతగా గుర్తింపు పొందిన ఆర్.కె అలియాస్ రామకృష్ణ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

ఇక ఈయన మరణంపై పలు రకాల వార్తలు సంచలనం రేపుతున్నాయి.సెంట్రల్‌ కమిటీలోని 14 మందిలో ముగ్గురు చనిపోయారు. ఇక మిగిలుంది కేవలం 11 మంది. వీరిలో ఏపీ నుంచి నంబాల కేశవరావు ఉన్నారు. మిగతా 10 మంది తెలంగాణ వారే. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, కడారి సత్యనారాయణ, మోడెమ్ బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌ రావు, గాజర్ల రవి, పక్కా హనుమంతు కేంద్ర కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. మొత్తానికి ఆర్కే తర్వాత మళ్లీ ఆస్థాయిలో నడిపించే నాయకుడైతే ప్రస్థుతానికి కనిపించడం లేదు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉక్కుపాదం మోపుతుండటంతో మావోయిస్టులకు కాలం చెల్లినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.