మరొకసారి తానేంటో నిరూపించుకున్న హీరోయిన్ రష్మిక..?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలదొక్కుకుంది. కిరాక్ పార్టీ అనే ఒక సినిమా నుండి ఇ హీరోయిన్గా పరిచయమై ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన ఇమేజ్ను కాస్త పెంచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఫోర్స్ జాబితా నటులలో అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ రేసులో సమంత, విజయ్ దేవరకొండ, హీరో యష్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఉన్నారు కానీ వారందరినీ దాటుకొని టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ భాషలో ప్రముఖుల సోషల్ మీడియాలో ఉండేటువంటి ఫాలోవర్స్, కామెంట్స్, వ్యూస్, లైట్స్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ లిస్టు తయారు చేశారు.

ఇక వీటిలో రష్మికా కు 10 కి 9.88 రాగా.. విజయ్ దేవరకొండ కి 9.67 రెండో స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో కన్నడ హీరో యశ్ 9.54 గా నిలిచాడు. అతి తక్కువ సమయంలోనే ఇలాంటి ఘనత సాధించిన హీరోయిన్గా రష్మిక మందార కూడా ఒకరు.