బిగ్‌బాస్ 5: ర‌విని న‌మ్మ‌కండి..ఇంటి స‌భ్యుల‌కు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌లు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అంద‌రూ ఊహించిన‌ట్టే శ్వేతా వ‌ర్మ‌ బ్యాగ్ స‌ద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావ‌డం యానీ, స‌న్నీ, ప్రియాంక, విశ్వ‌లు జీర్ణించుకోలేక‌పోయారు.

శ్వేతా ఎలిమినేటెడ్.. మానస్ డేంజరస్, రవికి దూరంగా ఉండాలి అంటూ కామెంట్స్ | Swetha Varma eliminated from Bigg Boss 5

ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే రవి గురించి చెబుతూ శ్వేత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..రవికి దూరంగా ఉండాలి.. నాకు అల్రెడీ అనుభవం అయింది. ఆయన ఆట బాగానే ఆడతాడు. అందులో బెస్ట్. కానీ ఆయన ఆట వల్ల మిగతా వాళ్లకు ఎఫెక్ట్ అవుతుంది.

Bigg Boss 5: శ్వేత ఎలిమినేట్.. రవికి దూరంగా ఉండాలి.. మానస్‌ డేంజర్‌: శ్వేత - swetha varma eliminated from bigg boss telugu 5

అందుకే ఆయ‌న దూరంగా ఉండండీ అంటూ ఇంటి స‌భ్యుల‌కు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, శ్వేత విష‌యానికి వ‌స్తే..ద రోజ్ విల్లా, ముగ్గురు మొన‌గాళ్లు, ప‌చ్చీస్‌, సైకిల్ వంటి చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ ప‌లు వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ షో ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయిన శ్వేత‌కు మ‌రిన్ని మంచి అవ‌కాశాలు త‌లుపుత‌ట్ట‌నున్నాయి.