బాల‌య్య ముందే రిస్క్ చేస్తున్న యంగ్ హీరో..స‌క్సెస్ అవుతాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య ముందే రిస్క్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు యంగ్ హీరో సంతోష్ శోభన్.

BalaKrishna's Akhanda First Single: Surprisingly Romantic

అస‌లు విష‌యం ఏంటంటే.. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వి సెల్యులాయిడ్, యస్కేయన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేక‌ర్స్‌. అయితే అదే రోజు బాల‌య్య న‌టించిన అఖండ విడుద‌లైతే.. ఆయ‌న ముందు `మంచి రోజులు వచ్చాయి`తో సంతోష్ స‌క్సెస్ అవుతాడా..? అన్న‌దే హాట్ టాపిక్‌గా మారింది.