బాలీవుడ్ లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల వాహా నడుస్తోంది. ఇందులో క్రీడాకారుల బయోపిక్ లకు ఎనలేని ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ తెరకెక్కింది మూడు మాత్రమే. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అతను ఎవరో కాదు క్రికెటర్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకోసం యువరాజ్ తో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది.

కరణ్ జోహార్ ప్రతిపాదనకు యువరాజ్ సింగ్ కు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని సమాచారం. అయితే యువరాజ్ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలని కాదని కరణ్ కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం. యువరాజ్ గతంలో హృతిక్ రోషన్, రన్బీర్ కపూర్ లో ఎవరో ఒకరు తన బయోపిక్ లో నటిస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ, కరణ్ మాత్రం కొత్త కుర్రాడు సిద్ధార్థ చతుర్వేది ని పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ కి యువరాజ్ సింగ్ దగ్గర పోలికలు ఉంటాయని అంటే యువరాజ్ సింగ్ ను ఒప్పించి మరీ అతని ఎంపిక చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.