చైతులో స‌మంతకు అస్స‌లు న‌చ్చ‌ని విష‌యం ఏంటో తెలుసా?

నాగ‌చౌత‌న్య‌, స‌మంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న‌ ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని స్ప‌ష్టం చేసేశారు. గ‌త నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయిన‌ప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌ట‌న రావ‌డంతో అంద‌రికీ షాక్ త‌గిలిన‌ట్టైంది.

Samantha Ruth Prabhu and Naga Chaitanya Akkineni Official Announce Their Separation After Months of Rumours

అయితే సామ్‌-చైతులు విడిపోవడానికి కార‌ణం ఏంటీ..? అన్న‌దే ఇప్పుడు చర్చనీయాంశంగా మార‌గా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. చైతులో స‌మంత‌కు న‌చ్చ‌ని ఓ విష‌యం వ‌ల్లే వీరిద్ద‌రూ విడాకుల వ‌ర‌కూ వెళ్లార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగచైతన్య-సమంత జంట‌గా సూపర్ హిట్ అయిన మూవీ ‘మజిలీ’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సామ్‌ మాట్లాడుతూ.. చైతు టూ పర్ఫెక్ట్‌గా ఉంటాడని, అది తనకు అస్స‌లు నచ్చదని తెలిపింది.

Samantha's husband Naga Chaitanya opens up for the first time about divorce rumours – Tamil News – IndiaGlitz.com » GetNews

ఇక ఈ విషయంలో సమంత బాగా ఇబ్బంది పడింద‌ట‌. ప్రతీ విషయంలో నాగచైతన్య పర్ఫెక్ట్‌గా ఉండటం వల్ల సమంత కూడా పర్ఫెక్ట్‌గా ఉండాల్సి వచ్చిందని, అలా వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి.. చివ‌ర‌కు విడాకుల వ‌ర‌కు దారి తీసింద‌ని కొందరు అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.