అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?

October 29, 2021 at 10:29 am

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. ప్ర‌స్తుతం సినిమాలు చేయడం పూర్తిగా త‌గ్గించేసింది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. అనుష్క వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

tamil cinema foto: Anushka Spicy Stills with Gopichand in Souryam

అయితే గ‌తంలో అనుష్క ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కూడా ఒక‌డు. గోపీచంద్, అనుష్కల‌ది చూడముచ్చటి జంట‌. హైట్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ పెర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్లుగా ఉంటారు. అలాగే వీరి కాంబోలో వ‌చ్చిన లక్ష్యం, శౌర్యం సినిమాలు రెండూ మంచి విజ‌యాలు అందుకోవ‌డంతో.. అనుష్క‌, గోపీచంద్‌లు ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు.

Neeharika singh (@Neeharikasing15) | Twitter

ఈ నేపథ్యంలోనే అప్ప‌ట్లో వారిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ అంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలు కాస్త గోపీచంద్ ఇంట్లో తెలిసి.. పెద్ద పెద్ద‌గా గొడవలు జరిగాయట. ఈ విష‌యం తెలుసుకున్న అనుష్క.. త‌మ మ‌ధ్య ఏమి లేద‌ని స్వ‌యంగా గోపీచంద్ ఇంట్లో వివ‌ర‌ణ ఇచ్చిందంట‌. దాంతో గోపీచంద్ ఇంట్లో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయ‌ని టాక్‌.

అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts