పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు- భీమ్లా నాయక్ వంటి సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక మరొక సినిమా హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేశాక హరీష్ తో కూడా పవన్ కళ్యాణ్ తన 28వ సినిమాని త్వరలో ప్రకటించబోతున్నట్లు గా సమాచారం.
తాజాగా సురేందర్రెడ్డి డైరెక్షన్లో వస్తున్న సినిమాకు ముంబై బ్యూటీ సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లుగా దర్శకనిర్మాతలు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ధ్రువీకరణ లేనప్పటికీ మేకర్స్ క్యాస్టింగ్ ఎంపికలు ఇతర ప్రీప్రొడక్షన్ పనులు బిజీ గా ఉన్నారని సమాచారం. ఇక సాక్షి తెలుగులో అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో నటిస్తోంది.
హీరోయిన్ సాక్షి పనితీరును సూరి కి నచ్చి పవన్ కోసం ఈ సినిమాలో ఆమె రికమండేషన్ చేసినట్లుగా సమాచారం. ఏదిఏమైనా ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.