బన్నీ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం?

నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ చూసి సూర్యవంశి చిత్ర నిర్మాత, ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను సూపర్ స్టార్ అంటూ తెగ పొగిడేశారు.ఏ రకంగా చూసినా అల్లు అర్జున్ సూపర్ స్టారే మీ ప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు కరణ్ జోహార్. ఈ మేరకు అల్లు అర్జున్ మాట్లాడిన క్లిప్ షేర్ చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.