ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది ముకుల్ రోహిత్గి వల్ల అయింది. ఆయన దేశంలోనే ఫేమస్ లాయర్.అటార్నీజనరల్‌గా కూడా పని చేశారు. అలాంటి ఆయన రంగంలోకి దిగితే బెయిల్ రాకుండా ఉంటుందా? ఇక మొత్తానికి ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయింది.

రేపు ఆర్యన్ ఖాన్ బయటకు రాబోతోన్నాడు. ఇక ఈ విషయంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు.అంటే ముకుల్ రోహిత్గి కంటే ముందు వాదించిన లాయర్లు అసమర్థులా? అంటే ఇన్ని రోజులు తప్పు చేయకుండానే ఆర్యన్ ఖాన్‌ను జైల్లో ఉంచారా? అని ప్రశ్నలు లేవనెత్తాడు.దేశంలో ఎంతో మంది ఇలా ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరు. అలాంటి వారంతా కూడా జైళ్లలో మగ్గిపోవాల్సిందేనా? అని ఆర్జీవీ ప్రశ్నించాడు. మొదటిసారిగా ఆర్జీవీ వేసిన ట్వీట్‌కు ఫుల్ పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి.