ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన‌ జ్యోతిష్యులు..నిరాశ‌లో అభిమానులు?!

`బాహుబ‌లి` సినిమా త‌ర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానుల‌ను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు డార్లింగ్‌. గ‌త ప‌దేళ్ల నుంచీ ఈయ‌న పెళ్లిపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ‌చ్చాయి.

Happy Birthday Prabhas! - The Leo News | English News

కానీ, ఏదీ నిజం కాలేదు. అస‌లు ఈయ‌న పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్ల‌కేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. అయితే నేడు ప్రభాస్ బ‌ర్త్‌డే సందర్భంగా జ్యోతిష్యులు ఆయ‌న జాతకాన్ని తిర‌గేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ సినీ కెరీర్ అద్భుతంగా ఉంటుంద‌ని తెలిపిన జ్యోతిష్యులు.. ఆయ‌న పెళ్లి చేసుకోబోయేది ఎప్పుడు అన్న విష‌యాన్ని కూడా ఓ అంచ‌నా వేసి చెప్పారు.

elebrity Astrologer Pandit Jagannath Guruji Prediction on Prabhas Marriage

ప్రభాస్ జాతకం ప్రకారం ఆయ‌న వివాహం 2023 ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యలో అవుతుందని తెలిపారు. ఒక‌వేళ అది మిస్సైతే కనుక‌ 2025 వరకు ప్రభాస్ పెళ్లి అయ్యే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ప్ర‌భాస్ పెళ్లి కోసం ఇప్ప‌టికే చాలా ఏళ్ల నుంచీ వెయిట్ చేసున్న అభిమానులు.. జ్యోతిష్యుల వ్యాఖ్య‌ల‌తో ఇంకా రెండేళ్లు ఆగాలా అంటూ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.