చిరంజీవి మరొకసారి తన విశాల హృదయంతో అభిమానికి సహాయం..?

మెగాస్టార్ చిరంజీవి అంటే వెండి తెరపై కనిపించి అభిమానులను అలరించే నటుడే కాదు నిజజీవితంలో కూడా ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తర్వాత ఆ సమయంలో కూడా ఆక్సిజన్ వంటి పరికరాలను ప్రజలకు అందించడం జరిగింది. అయితే తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమానికి ఎంత ఖర్చు చేసైనా బతికించేందుకు సిద్ధమయ్యాడు చిరంజీవి.

ఇక అసలు విషయంలోకి వెళితే విశాఖపట్నంలోని చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ వ్యాధికి గురి అయి పోరాడుతున్న అనే విషయం అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు దృష్టికి తీసుకుని వెళ్లగా.. ఆ యువకుడిని వెంటనే హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం తరలించామని చెప్పుకొచ్చాడు చిరంజీవి.

ఇక ఆ అభిమాని వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు చిరంజీవి. దీంతో మెగా అభిమానులు చిరు విషయంపై మరింత గర్వం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరికొందరు కూడా చిరంజీవిని అభినందిస్తున్నారు.