బిగ్‌బాస్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన శ్వేతా వర్మ..?

October 23, 2021 at 8:40 am

మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప్ర‌స్తుతం 13 మందే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ కాగా.. వారిలో ఐదుగారు ఆడ‌వారే ఉండ‌టం గ‌మన్నార్హం. అయితే ఆరో వారం ఎలిమినేట్ అయిన శ్వేతా వ‌ర్మ‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసింది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతావర్మ గురించి మీకు తెలుసా.. అసలు ఈ అమ్మడు ఎవరంటే.? | Bigg boss 5 telugu contestants swetha varma about her herself | TV9 ...

వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో అతడు స్ట్రాంగ్ మ‌రియు బ‌య‌ట ఎంతో పాపులర్‌ కంటెస్టెంట్‌ అని పేర్కొంది. ఇక ప్రియ, సన్నీకి మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ.. వాళ్లిద్దరికీ కొట్లాట జరిగింది. కానీ మెజారిటీ ప్రేక్షకులు అదంతా ప్రియ వల్లే జరిగిందని నిందిస్తూ సన్నీకి సపోర్ట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

VJ Sunny Bigg Boss Fame: Age, Height & Family- CelebSecrets.in

శ్వేతా చెప్పింది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి. కాగా, ఈ వారం కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, జెస్సీ, యాంకర్ రవి మ‌రియు లోబోలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. వీరిలో ఆనీ మాస్ట‌ర్ లేదా లోబో ఎలిమినేట్ అవ్వొచ్చ‌ని అంటున్నారు.

 

బిగ్‌బాస్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన శ్వేతా వర్మ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts