బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కొనసాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే.. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ మరియు ప్రియలు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది.
ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్లు నామినేట్ అయ్యారు. అయితే తాజా నామినేషన్స్‌తో యాంకర్ రవి నయా రికార్డు క్రియేట్ చేశారు. ఈయన ఇప్పటి వరకు ఒక్క వారం కూడా మిస్ కాకుండా 8 వారాలూ నామినేట్ అయ్యాడు. కొన్నివారాలు సీరియస్ కారణాలతోనే ఈయన్ని నామినేట్ చేసారు ఇంటి సభ్యులు.
కానీ కొన్నిసార్లు సిల్లీ రీజన్లతో కూడా నామినేట్ అయ్యాడు. ప్రతి సారి సేవ్ అవుతున్నాడు కదా అని ఇంటి సభ్యులు సైతం రవిని నామినేట్ చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఏదేమైనా కూడా వరసగా 8వ సారి నామినేట్ అయి రికార్డులు తిరగరాశాడు యాంకర్ రవి. అయితే మరోవైపు రవి ఫ్యాన్స్.. సేవ్ అవుతున్నాడు కదా అని ప్రతీవారం నామినేషన్స్‌లోకి పంపటం దారుణమంటూ ఫైర్ అవుతున్నారు.