బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈ షోకు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంటారు. తెలుగులో ప్రస్తుతం నాగార్జున హొస్ట్ ఐదో సీజన్ ఇటీవలె ప్రారంభమై.. భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది.
ఇక మరోవైపు తమిళంలోనూ కమల్ హాసన్ హోస్ట్‌గా ఐదో సీజన్ రన్ అవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. అయితే ఆమెకు రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపింది.
`బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ స్నేహితురాలు అక్షరకు అభినందనలు. నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకుని రా.. ఆల్ ద బెస్ట్` అంటూ మిహికా ఓ వీడియో వదిలింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక అక్షర రెడ్డి విషయానికి వస్తే.. ఈమె ఒక మోడల్, మిస్ గ్లోబ్ 2019 అవార్డు గ్రహీత. మరియు పలు సినిమాల్లోనూ నటించింది.
https://www.instagram.com/p/CVc8l7bIcua/?utm_source=ig_web_copy_link