హీరో మాధవన్ కుమారుడు అరుదైన రికార్డ్?

హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ తరం వారికి ఈ హీరో అంతగా గుర్తు లేకపోయినా, ఇంతకుముందు ఈయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 వేదాంత్ ఏడు జాతీయ అవార్డును గెలిచి అరుదైన ఘనతను సాధించారు.

తన కృషితో కుటుంబం మంచి పేరును తేవడంతో పాటు, దేశం పేరు మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవలే ముగిసిన 47వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్ లో 2021లో మొత్తం ఏడు పథకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి ఒక ట్వీట్ చేశారు. మాధవన్, వేదాంత కలిసి ఉన్న ఫోటో ని ట్వీట్ చేస్తూ గుడ్ జాబ్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వ పడుతున్నాను అలాగే నీ పెంపకం చూసి కూడా అంటూ తన తండ్రి పై ప్రశంసల వర్షం కురిపించారు.

https://twitter.com/DrAMSinghvi/status/1452187322108284932?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452187322108284932%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Factor-r-madhavan-son-vedant-won-7-medals-swimming-championship-1406796

కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో వేదాంత్‌ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్‌ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు.