శ్రీను వైట్ల కు కాల్ చేసి ఏడ్చిన సమంత..?

డైరెక్టర్ శ్రీనువైట్ల అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మహేష్ బాబు సమంతతో కలిసి దూకుడు సినిమా తీశాడు.ఈయన సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో ఒకడిగా చేరిపోయాడు.దూకుడు సినిమా సమయంలో సమంత ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి తెలియజేశాడు శ్రీనువైట్ల ఆ విషయాలను చూద్దాం.

దూకుడు సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాంబుల్ లో జరుగుతుండగా.. ఒక రొజు సమంత షూట్ లేకపోవడంతో షాపింగ్ కు వెళ్లాలని శ్రీను వైట్ల. చెప్పడంతో ఆమె షాపింగ్ కు వెళ్లిన పదినిమిషాల తర్వాత ఆమె కళ్ళముందు ఆత్మాహుతి దాడి జరగడంతో.. సమంత శ్రీను వైట్లకి ఏడ్చుకుంటూ కాల్ చేసిందట. హ్యూమన్ బాంబును చూసి షాక్ నుంచి సమంత తేరుకోలేక పోయిందట.

ఇక తొలిసారిగా ఇస్తాంబుల్ లో భూకంపాన్ని చూశానని పెద్ద హోటల్లో 36 అంతస్తులోని రూమ్ లో పడుకోగా అంతా ఉగినట్లు అనిపించింది అని తెలియజేశారు శ్రీనువైట్ల. ఇస్తాంబుల్ లో ముంబైతో పోలిస్తే 5 శాతం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని శ్రీను వైట్ల తెలియజేశాడు. ఇక ఇస్తాంబుల్ నుండి ఇండియాకు తిరిగిరావడానికి వారి దగ్గర ఉండవలసిన పాస్ పోర్ట్ కూడా మిస్ అయ్యాయని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్న షూటింగ్ సమయంలో మాత్రం సంతోషంగా చేసేవారని వెల్లడించాడు శ్రీనువైట్ల.