బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా తీసుకుని సీక్వెల్ గా రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటు, నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు.

నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ సేమ్ మోనాల్ గజ్జర్ కూడా బంగార్రాజు సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఈమెతో ఒక ఐటెం సాంగ్ ను కూడా చిత్రీకరించారట. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో మరొక ఇద్దరు బ్యూటీస్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వేదిక, అలాగే మీనాక్షి చౌదరీలు ఈ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారట. వీళ్లు కూడా త్వరలోనే షూటింగులో పాల్గొంటున్నారని సమాచారం.