ఆ సినిమాలో నటించేందుకు వెళ్లి టైం వేస్ట్ చేసుకున్న.. నియా శర్మ?

September 24, 2021 at 8:58 pm

నియా శర్మ బుల్లితెర బోల్డ్ బ్యూటీ గా అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం గ్లామర్ షో లో మాత్రమే బోర్డ్ కాకుండా మాటల్లో కూడా బోల్డ్. ఇక తాజాగా ఈమె కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా గురించి గుర్తు చేసుకొని ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించేందుకు వెళ్లి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. సాధారణంగా ఇటువంటి విషయాలను బాలీవుడ్ బ్యూటీస్ బయటపెట్టరు. కానీ నియా శర్మ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. కంగనా టైటిల్ రోల్లో మణికర్ణిక తెరకెక్కుతుండగా నియా శర్మ ఒక చిన్న పాత్ర కోసం క్యాస్టింగ్ మీట్ కు అటెండ్ అయిందట.

అక్కడ ఉన్న ఆయన చాలా సేపు సోది చెప్పాడట, కానీ క్యారెక్టర్ ఇవ్వకపోగా చివర్లో ఆ పాత్రకు నువ్వు చాలా హాట్ గా అయిపోతావ్ అనిపిస్తోంది అని అన్నాడట. అసలు తాను అక్కడికి వెళ్లడమే పెద్ద దండగ అంటోంది నియా. ఇది ఇలా ఉంటే నియా శర్మ కు ఇప్పటి వరకు బాలీవుడ్ లో బిగ్ బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే చాలా చిరాగ్గా ఉన్నాయి బ్యూటీ స్టార్ కృష్ణ టార్గెట్ చేసి, బాలీవుడ్ లోకి వస్తున్న వారసులు అందం టాలెంట్ తో ఆకట్టుకోవడం లేదని తేల్చేసింది. అంతేకాకుండా వారి ఇంటి పేర్లు పక్కన పెడితే వాళ్ళని ఎవరు రెండోసారి కూడా చూడరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది..

ఆ సినిమాలో నటించేందుకు వెళ్లి టైం వేస్ట్ చేసుకున్న.. నియా శర్మ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts