నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు చిర్రెత్తిపోయిన శ్రుతిహాస‌న్‌.. ఏం అడిగాడంటే?

శ్రుతిహాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ఈ స్టార్ కిడ్‌..ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రుతి.. ఇటీవ‌ల క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్‌తో మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

Shruti Hassan goes drop dead gorgeous in her black beauty saree look

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్` చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే శ్రుతిహాస‌న్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు పెడుతూ ఉంటుంది. తాజాగా తన ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ శృతీ హాసన్‌ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈ ప్రేమాయణాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా.?’ అని కాస్త వ్యంగ్యంగా ప్రశ్నించాడు.

Shruti Haasan posts an adorable pic with rumoured BF Santanu Hazarika;  calls him 'best lockdown buddy' | Bollywood Bubble

దాంతో చిర్రెత్తిపోయిన శ్రుతి.. అత‌డికి స్ట్రోంగ్ రిప్లై ఇచ్చింది. `వివాహం అనేది పూర్తిగా నా వ్యక్తిగత వ్యవహారం, దాని గురించి ఊహాగానాలు చేసుకుంటూ మనసు పాడు చేసుకోవద్దు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం చేయడం మంచి లక్షణం కాదు` అంటూ స‌మాధానం ఇచ్చింది. కాగా, ఈ ముద్దుగుమ్మ‌ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమాయణం న‌డిపిస్తోంది. అంతేకాదు, అత‌డితో ప‌బ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ ఈ మ‌ధ్య వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా కూడా మారింది.